పిడుగుపాటుకు మృతి చెందిన గేదె

55చూసినవారు
పిడుగుపాటుకు మృతి చెందిన గేదె
ఉరుములతో, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డికి చెందిన గేదె పిడుగుపాటుకు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో దాదాపు 45 వేల రూపాయలు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్