జనగామ జిల్లా పాలకుర్తి మండలం పరిధిలో వేసవిలో విపరీతంగా ఐస్ క్రీమ్ బండ్లు తిరుగుతున్నాయి. వివిధ గ్రామాలలోకి వచ్చి వివిధ రకాల ఐస్ క్రీమ్ లను విక్రయిస్తున్నారు. వాటిలో చాలా వరకు కాలం చెల్లిన అత్యధికంగా మొతాదుకు మించిన రసాయనిక ఫ్లేవర్లు వాడుతుండటం వలన అవి తిన్న చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.