పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన విద్యాధికారి

1266చూసినవారు
పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన విద్యాధికారి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పలు పాఠశాలలను విద్యాధికారి సిగసరపు యాదయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి, హరితహారం అమలు తీరును పర్యవేక్షించారు. మండల విద్యావనరుల కేంద్రానికి వచ్చిన యాదయ్య రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, ఆయా పాఠశాలల్లో నాటిన మొక్కల వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్‌, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ గోలి రవీందర్‌రెడ్డి, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్