బీజేపీ నాయకుల అరెస్ట్

867చూసినవారు
బీజేపీ నాయకుల అరెస్ట్
బీజేపీ పార్టీ దేవరుప్పుల మండల శాఖ కార్యకర్తలు బుధవారం భూపాలపల్లి జిల్లా తడిచర్ల మండలం మల్లారం గ్రామానికి బయల్దేరడంతో దారి మధ్యలో స్థానిక ఎస్ఐ రామారావు నేతృత్వంలో అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ దుబ్బా రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ...మల్లారం గ్రామంలో రాజబాబు అనే దళిత యువకుడిని టీఆర్ఎస్ నాయకులు దారుణంగా హత్య చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, దళితులపై దాడులు చేయడం టీఆర్ఎస్ శ్రేణులకు అలవాటుగా మారిందని, దళితుల పట్ల టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని అన్నారు. అరెస్ట్ అయినవారిలో మండల పార్టీ అధ్యక్షులు భాగాల నవీన్ రెడ్డి, నల్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్