పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల పాల్కురికి సోమనాథ స్మృతి వనంలో సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన తొలి తెలుగు ఆదికవి పాల్కురికి సోమనాథుడు దీపారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి హాజరయ్యారు. సోమనాథుని విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, దీపారాధన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం కవులకు, కళాకారులకు, రచయితలకు నిలయమన్నారు.