వైభవంగా శ్రీ సోమేశ్వర స్వామి మాస కళ్యాణం

56చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి, చండిక అమ్మవారి  ఆలయంలో చండికాసమేత శ్రీ సోమేశ్వర స్వామి వారికి మాసకళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మహా వైభవోపేతంగా జరిగిన ఈ కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్