ముగ్గురు చిన్నారులను కరిచిన కుక్కలు

77చూసినవారు
మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ పట్టణంలో మంగళవారం అంబేద్కర్ నగర్ కాలనీలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులతో పాటు మరో ముగ్గురి పై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన వారిని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఇటీవల కాలంలో కుక్కల భయంతో స్థానికులువణికి పోతున్నారు. కుక్కల బారి నుండి రక్షించాలని పట్టణ ప్రజలు వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్