వారాంతపు సంతలో పదిహేను రూపాయలకే టమాట

548చూసినవారు
రోజు వారీ విక్రయాలలో గ్రామాల్లో టమాట ముప్పై రూపాయలకు కిలో లభిస్తుండగా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో నిర్వహించిన వారాంతపు సంతలో కిలో టమాట పదిహేను రూపాయలకు లభించింది. ప్రతి గురువారం నిర్వహించే ఈ వారాంతపు సంతలో తాజా కూరగాయలు తక్కువ ధరలకు లభించినట్లు, దోస, వంకాయ, బెండకాయ కిలో ముప్పై, బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి తదితర కూరగాయలు కిలోకు యాబైకు లభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్