సంగెం మండల ప్రజా పరిషత్ నూతన ఎంపీడీఓగా వెంకటేశ్వర్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతిరెడ్డి తిరుపతిరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లు రవి, శ్రీను, ఆకులరాజు, అశోక్, ఉపేందర్, హరినాథ్, దేవ్ సింగ్, శ్రీదేవి, లలిత, రాజ్ కుమార్, లింగమూర్తి ,తదితరులు పాల్గొన్నారు.