హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామంలో గురువారం సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో ఎంపీపీ మార్క సుమలత రజినికర్ గౌడ్, జడ్పీటీసీ కెర్ల రాధిక రాజుగౌడ్ గిరక తాడిచెట్ల మొక్కలను నాటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు గీత కార్మికుల గురించి గిరక తాడిచెట్లు నాటడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, ఏఎంసి చెర్మన్ కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.