వరంగల్ గరీబ్ నగర్ లో అక్రమంగా ఇంట్లో నిలువ ఉంచిన 14 క్వింటాళ్ల బియ్యాన్ని ఆదివారం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. పద్మ అనే మహిళ తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొని ఎక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముతున్నదనే సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ బియ్యం విలువ 35 వేలు ఉంటుందని తదుపరి విచారణ నిమిత్తం గీసుకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపోయారు.