పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం పరకాలలో 148 మంది అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుండి 1కోటి 48 లక్షల 17168 రూ చెక్కులను, 122 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ 36లక్షల 55వేల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.