పరకాలలో శూన్య నీడ ప్రయోగం
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా, నిల్చున్నా, కూర్చున్నా మన నీడ మనకు కనబడుతోంది అయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఏడాదికి రెండుసార్లు సూర్యుని కిరణాలు మనిషికి నడి నెత్తి మీద పడుతూ రెండు మూడు నిముషాలు నీడ మాయమవుతుంది. దీనిని శూన్య నీడ దినం అంటారు. అయితే ఈ ఏడాది మే 9న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శూన్య నీడ దినంగా పరకాలలో గ్రంథాలయం వద్ద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ టీమ్ ప్రయోగాత్మకంగా చూపించారు.