మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
దామెర మండల కేంద్రంలోని లాదెళ్ళ గ్రామంలో బూత్ అధ్యక్షులు డెంగ్ నవీన్, పిడుగు అనిల్ ఆధ్వర్యంలో లాదెళ్ళ బొమ్మలదేవి చెరువులో ఉపాధి హామీ కూలీలను కలసి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎలక్షన్లలో ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.