హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో శనివారం జరిగిన "పాటల పల్లకిలో 12 గంటలు" కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలకు పాటలే ప్రాణమని, పాట లేకుండా ఉద్యమాల భావవ్యాప్తి జరగదని అన్నారు. ఒక్క పాట కొన్ని వేల మందిని కదిలిస్తుందని, తెలంగాణ ఉద్యమంలో పాటల సాహిత్యం ఎంతో దోహదపడిందని తెలిపారు.