పెరిణి నాట్యంలో శిక్షణ

61చూసినవారు
పెరిణి నాట్యంలో శిక్షణ
నటరాజ కళా కృష్ణ నృత్య జ్యోతి అకాడమీ ఆధ్వర్యంలో నెల రోజులపాటు పెరిణి నాట్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అకాడమీ నాట్యాచార్యులు గజ్జల రంజిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పదిన్నర గంటల వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు 9393004755 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్