హనుమకొండ లో ఉన్న జూపార్కు ను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని దేవునూరు కు తరలిస్తామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డు కాకతీయ జూపార్కులో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించి మొక్కలు నాటారు. దేవునూరులో 200ఎకరాల్లో జూ పార్కును హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు.