వరంగల్ జిల్లాలో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. కిష్టపురం గ్రామానికి చెందిన బన్నీ, తన స్నేహితుడితో ద్విచక్ర వాహనంపై కిష్టపురం నుంచి కాట్రపల్లి వెళ్తూ వాంకుడోత్ తండా క్రాస్ రోడ్డు తోడెల బండ మూల మలుపు వద్ద బైకు అదుపుతప్పి ప్రక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. యువకుల మృతిదేహాల వద్ద వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసెల విలపిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.