వరంగల్ నగరంలో భారీ మొత్తంలో కల్తీ, కాలం చెల్లిన బేకరీ పదార్థాల కేక్ లపై వాడే ఫైనాపిల్, ఆపిల్, మంగో, చిల్లి, టమోటా సాస్ లు, స్పైసి కోసం వాడే ఫ్లేవార్లు, పౌడర్లు, చాక్లెట్ స్టిక్లు, కలర్ హాట్సు పేస్ట్ లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. 196 రకాల సుమారు 8 లక్షల విలువ గల బేకరీ ఐటంలు స్వాధీనం చేసుకున్నారు. బేకరీ ఐటంలు అమ్మే సంతోష్ కుమార్ కిరాణం పై దాడి చేశారు.