వరంగల్ రంగశాయిపేట లో శనివారం వాగ్బట యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం బాధ్యులు పెసర నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లు, ఒత్తిడులను అధిగమించాలంటే ప్రతి వ్యక్తి రోజుకు కొంత సమయం ధ్యానానికి కేటాయించాలని సూచించారు.