వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఏకశిలా నగర్ ప్రాంతంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి రోడ్లు ఇలా నీటితో నిండి పోయాయి. వర్షం కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు మారుతున్నారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.