రాత్రి సమయాల్లో మూసి ఉన్న షాపుల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్టు చేసినట్లు బుధవారం సాయంత్రం మట్టెవాడ సీఐ గోపి తెలిపారు. గత నెల 27న ఏడు మోరీల వద్ద జగదాంబ ఐరన్ షాపు, దుర్గా ఐరన్ షాపు, కనకదుర్గ ఐరన్ షాపుల్లో దొంగతనాలు జరిగాయి. సీసీ కెమె రాల ఆధారంగా ప్రధాన నిందితుడైన జువ్వనూరు బసవరాజు అలి యాస్ ఎండీ సలీం అలియాస్ రాజు ను హంటర్ రోడ్డులో అరెస్ట్ చేశారు.