దొంగచాటుగా బతుకమ్మ కుంటను పూడ్చివేస్తున్నారు

50చూసినవారు
వరంగల్ శివనగర్ లోని బతుకమ్మ కుంటను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా పూడ్చివేస్తున్నారు. కాకతీయుల మట్టికోట పక్కన వాకింగ్ ట్రాక్ నిర్మాణం పేరిట, అండర్డైయిన్ నిర్మాణంలో తీసిన మట్టిని బతుకమ్మ కుంటలో రాత్రి వేళ డంపింగ్ చేస్తున్నారు. మట్టి పోసే పనులు రాత్రివేళ జరుగుతుండటాన్ని శివనగర్ వాసులు శివనగర్ బతుకమ్మ కమిటీ బాధ్యులైన రేణికుంట్ల శివ, కొత్తపల్లి శ్రీనివాస్ మంత్రి కొండా సురేఖ దృష్టికి గురువారం తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్