వరంగల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఆడేపు సాగర్ అనారోగ్యoతో మృతి చెందడం బాధాకరమని, ఆయన మరణం తీరని లోటని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గత కొద్ది రోజులుగా ఎంజీఎంలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు ఆడేపు సాగర్ గురువారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.