పశ్చిమబెంగాల్ పీజీ ప్రెసిడెంట్ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య కేసులో న్యాయం చేయాలని వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం వరంగల్ ఐఎంఏ హాల్ నుండి కేఎల్సి వరకు నిరసన ర్యాలీ వైద్యులు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం జంక్షన్లో మానవాహారం నిర్వహించి నినాదాలు చేశారు. వైద్యులు మాట్లాడుతూ, వైద్య వృత్తిలో విధులు నిర్వహించే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.