హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో గల శివాలయంలో శనివారం కార్తీక మాసం కోటీ సోమవారం సందర్భంగా అర్చకులు అవధానుల సీతారామ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కోటి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం చేసుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు అర్చకులు అవధానుల సీతారామ శాస్త్రి తెలిపారు.