శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుదామని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నుండి అక్టోబర్ 31 తేదీన పోలీస్ అమరవీరుల స్మరించుకుంటూ పోలీస్ ఫ్లాగ్ డేను నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని తోలిరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించబడుతుందని సీపీ తెలిపారు.