వినాయక నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్ (పశ్చిమ) నియోజకవర్గ పరిధిలోని పద్మాక్షి గుండం బంధం చెరువు ప్రాంతాల్లో శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థవంతంగా ఏర్పాట్లు చేయుటకు అధికారులను నగర మేయర్ గుండు సుధారాణి స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశించారు. నిమజ్జన ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.