భద్రకాళి అమ్మవారి శాకంబరీ వేడుకల్లో భాగంగా ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మేయర్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి అమ్మవారి శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం భద్రకాళి ఆలయ ఆవరణలో గల సాయి బాబా మందిరంలో మేయర్ పూజలు నిర్వహించారు.