హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం స్థానికుల సమాచారం ప్రకారం మల్లూరు మంగపేటకి వెళ్లి తిరిగి వస్తున్న కారు గూడెప్పాడ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో మూడు నెలల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన తల్లి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించినట్లు తెలిపారు.