వరంగల్: మిగిలిన పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

61చూసినవారు
వరంగల్: మిగిలిన పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌
కాళోజి వర్సిటీ పరిధిలోని ప్రైవేటు పీజీ వైద్య కళాశాలల్లో మిగిలిపోయిన మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి వర్సిటీ శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ కింద వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ప్రొవిజినల్‌ ఫైనల్‌ మెరిట్‌ జాబితాలో పేర్లున్న వారు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈనెల 20 సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్