ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.