సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అపుడే మహిళా సాధికారత సాదించినట్లవుతుందని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ శర్మ అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రం శ్రీదేవి ఏషియన్ మాల్ ప్రాంతంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలోని ధ్యానమందిరంలో చైర్మన్ హరగోపాల్ శర్మ ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట రంగాల్లో సేవలందించిన సుమారు 60 మందికి షీల్డ్ అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం హరగోపాల్ శర్మ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి మహిళలను ప్రోత్సాహించాలనే సదుద్దేశ్యంతో పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన మహిళలను గౌరవించుకుంటున్నామన్నారు. భారతదేశంలో ఉన్న నదులకు చాలా వరకు పెట్టిన పేర్లు మహిళలవేనని గుర్తు చేసారు. సమాజంలో మహిళలు అన్ని రంగాలలో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారన్నారు. రాజకీయాలలో, విద్య , ఉద్యోగ రంగాలలో ముందుకు వస్తున్నారని, అయితే మహిళలు సమాజంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని ఇంకా సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కుటుంబ పోషణతోపాటు సమాజ అభ్యున్నతికి పాటుపడుతున్న మహిళలను గౌరవించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మల్లం కీర్తి స్వాగత నృత్యం చేసారు.
కార్యక్రమంలో ధర్మకర్తలు రాకం సదానందం, వేయిగండ్ల రమేష్, నిమ్మల శ్రీనివాస్, మందిర సిబ్బంది సాయికృష్ణ, రాజు, పద్మజ, సత్కార గ్రహీతలు డాక్టర్ పొడిచెట్టి వరలక్ష్మి, శుభోద, బి. రమాదేసి, సాగంటి మంజుల, టి. విజయలక్ష్మి, డాక్టర్ రచ్చ కళ్యాణి, టివి సుజాతకుమారి, స్వప్న మాధురి, డా. పి. మంజుల వాణీదేవి తదితరులు ఉన్నారు.