హనుమకొండ సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశానుసారం సీజనల్ వ్యాధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.