కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రావుల రాజు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని తెలిపారు. మండల అధ్యక్షుడు ఎండి మై బెల్లీ, ఏఐటియు జిల్లా అధ్యక్షుడు మాదాసి యాకూబ్, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.