హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూలు కులాల విచారణ కమిషనర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్ కి గురువారం మెమోరండం సమర్పించారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మడికొండ అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షుడు ఎడబోయిన ప్రభాకర్, కార్యదర్శి జవ్వాజి కిషన్, కాలేశ్వర పు రాజేందర్, వెనమల్ల రమేష్, అంకేశ్వర కుమారస్వామి, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.