వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిన్నింటి అనిల్ రావు, పర్వతగిరి ఎంపిటిసి బొట్ల మహేంద్ర, పట్టణ అధ్యక్షులు దారం పూర్ణచందర్, యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, కల్లెడ సొసైటీ డైరెక్టర్లు జూలపల్లి గంగాధర్ రావు, యాకయ్య యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పిన్నింటి సునీల్ రావు, గొడుగు బిక్షపతి, రాంచందర్ రావు, సురేందర్ రావు, మోహన్ రావు, వెంకన్న, మోహన్ నాయక్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ నరుకుడు రవీందర్, సోమారం గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్కే అక్బర్ పాష, సోమారం వార్డ్ నెంబర్ యాకూబ్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, సాంబరాజు, నరేష్, నిరంజన్, రంజిత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.