ప్రధానమంత్రి జీవనజ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ నవీన్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఖాతాదారులకు సమావేశం ఏర్పాటు చేసి జీవన జ్యోతి బీమా పథకంలో 2 లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల సాధారణ బీమా ఉంటుందన్నారు. అందుకు ప్రతి ఖాతాదారులు 330 రూపాయలు చెల్లించాలని, ఏడాదికి 12 రూపాయలు చెల్లించి రెండు లక్షల ప్రమాద భీమా పొందవచ్చని తెలిపారు ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సుమతి బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు.