అంతర్జాతీయ క్రికెట్‌కు వార్నర్ వీడ్కోలు

67చూసినవారు
అంతర్జాతీయ క్రికెట్‌కు వార్నర్ వీడ్కోలు
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తనకు కెరీర్‌లో టీ20 ప్రపంచ కప్ చివరిదని ఆయన గతంలోనే ప్రకటించారు. ఇక మంగళవారం సూపర్-8లో భాగంగా భారత్‌ చేతిలో ఓటమితో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో అదే వార్నర్‌కు చివరి మ్యాచ్ అయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలతో సహా వార్నర్ 18,995 పరుగులు సాధించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్