గద్దర్ కోరికతో తూప్రాన్‌లో నీళ్లు, GHMC కార్మికుల జీతాలు పెంపు: హరీశ్

72చూసినవారు
ఈ ఐదు దశాబ్దాలలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరన్న ఉన్నాడని BRS నేత హరీశ్ రావు కొనియాడారు. సిద్దిపేటలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రజా యుద్ద నౌక గద్దరన్న సాహిత్యం కార్యక్రమంలో హరీశ్ పాల్గొని మాట్లాడారు. 'తెలంగాణ ఏర్పడ్డాక తూప్రాన్ లో నీళ్లులేవు హల్దీ వాగులో లిఫ్ట్ పెట్టి నీళ్లు ఇవ్వాలని గద్దర్ కోరితే, 8 నెలల్లో పూర్తి చేసి ఆయనతోనే ప్రారంభించాం. ఆయన కోరికతో GHMC మున్సిపల్ కార్మికులకు ఒక్క సంతకంతో జీతాలు పెంచాం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్