తెలంగాణలోని గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యాలు లేక పోవడమే వెనకబాటుకి కారణమని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి ఆవాసం నుంచి గ్రామపంచాయతీ, అక్కడ నుంచి మండలానికి, జిల్లా కేంద్రానికి రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. 'రూ.2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నాం. 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలి. రూరల్ ఇంజనీర్లు కార్యాచరణ సిద్ధం చేయాలి' అని ఆదేశించారు.