వేములవాడ రాజన్న అబివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం

81చూసినవారు
వేములవాడ రాజన్న అబివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ.. దేవాలయ అబివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని చెప్పారు. శివరాత్రి పూర్తి కాగానే అభివృద్ది పనులు వేగవంతం చేసి మళ్ళీ శివరాత్రి నాటికి చెప్పిన పనులు పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్