కల్తీ నెయ్యి కేసు.. నిందితులను మరోసారి కస్టడీకి కోరుతూ సిట్‌ పిటిషన్‌

57చూసినవారు
కల్తీ నెయ్యి కేసు.. నిందితులను మరోసారి కస్టడీకి కోరుతూ సిట్‌ పిటిషన్‌
AP: తిరుపతి కల్తీ నెయ్యి కేసులో నిందితులను మరోసారి కస్టడీకి కోరుతూ సిట్‌ పిటిషన్‌ వేసింది. నిందితులు పొమిల్‌ జైన్‌, అపూర్వ చావడా విచారణకు సహకరించలేదని సిట్‌ పిటిషన్ లో పేర్కొంది. మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ తిరుపతి రెండో ఏడీఎం కోర్టులో సిట్‌ వాదనలు వినిపించింది. తమ వాదనలు వినిపించడానికి నిందితుల తరఫు లాయర్లు సమయం కోరారు. దీంతో  న్యాయస్థానం కస్టడీ పిటిషన్‌ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్