పాక్‌ సరిహద్దులో ఎలాంటి అలజడి లేదు: భారత సైన్యం

53చూసినవారు
పాక్‌ సరిహద్దులో ఎలాంటి అలజడి లేదు: భారత సైన్యం
పాకిస్తాన్ సరిహద్దులో ఎలాంటి అలజడి లేదని భారత సైన్యం గురువారం వెల్లడించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం చెక్కుచెదర్లేదని తెలిపింది. ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం భద్రతా విధులు కొనసాగుతున్నాయని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. భారీ కాలిబర్‌ ఆయుధాలతో కాల్పులు జరగలేదని సైన్యం వివరణ ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌ పూంఛ్‌ జిల్లాలో బుధవారం రాత్రి పాక్ కాల్పులకు తెగబడిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్