అతడి విధ్వంసం మాకు తెలుసు: ఇంగ్లాండ్ కోచ్

79చూసినవారు
అతడి విధ్వంసం మాకు తెలుసు: ఇంగ్లాండ్ కోచ్
ప్రస్తుత పొట్టి కప్‌లో కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. అయినా, తాము మాత్రం విరాట్‌పై ఓ కన్నేసి ఉంచుతామని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ మాథ్యూస్ మాట్‌ వ్యాఖ్యానించాడు. విరాట్‌ను అడ్డుకొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించాడు. ‘కీలకమైన మ్యాచుల్లో విరాట్ మరింత నైపుణ్యం ప్రదర్శిస్తాడు. టీమిండియాకు అతడే కీలక ప్లేయర్‌ అనడంలో సందేహం లేదు. పెద్ద మ్యాచుల్లో తమ విలువేంటో స్టార్లు ఆటతీరుతో చెబుతారు’ అని మాట్ వ్యాఖ్యానించాడు.

సంబంధిత పోస్ట్