BRS ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని.. చెప్పినట్లే చేశామని సీఎం రేవంత్ అన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున ‘భూభారతి’ చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. 'గత ప్రభుత్వం అనాలోచితంగా ధరణి పొర్టల్‌ను తెచ్చింది. ఈ పోర్టల్ ఎన్నో సమస్యలకు కారణమైంది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రైతుల సమస్యలకు భూభారతి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.