AP: నరసరావుపేటకు చెందిన 600 మంది చిట్ ఫండ్ బాధితులు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దకు తరలివచ్చారు. సాయిసాధన చిట్ ఫండ్ సంస్థ యాజమాన్యం మోసం చేయడంతో తాము కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ముని పోగొట్టుకున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని.. బాధితులకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.