సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

68చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం టీడీపీ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లలో గెలవని చోట కూడా ఈ సారి విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని వెల్లడించారు. ఐదేళ్లలో కార్యకర్తలు, నేతలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిందని కక్ష సాధింపు చర్యలు, ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్