దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9న మొదలైన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర
మోదీ మాట్లాడుతూ.. వాతావరణ పరిశీలనకు ‘జీ20 ఉపగ్రహాన్ని’ ప్రయోగిస్తామని ప్రతిపాదించారు. దక్షిణార్ధ గోళ దేశాలకు ఇది సాయంగా ఉంటుందని పేర్కొన్నారు. చంద్రయాన్ మిషన్ నుంచి వచ్చిన డేటా తరహాలో జీ20 ఉపగ్రహం వల్ల మానవాళికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు.