తెలంగాణలోని నల్గొండలో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పారు. రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసి త్వరలో రేషన్ దుకాణాల్లో సన్నాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు సన్నాలు పండించాలని సీఎంకోరారు. మీరు తెలంగాణ సోనా పండించండి.. మేము వరికి మద్దతు ధరతో పాటు సన్నాలు పండిస్తే రూ. 500 బోనస్ ఇచ్చి కొంటామన్నారు.